అపార్ట మెంట్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: తార్నాకా విజయపురి కాలనీలోని గరుడ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 55 ఏళ్ల మహిళ సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.