అమరజీవి కాకి లక్ష్మారెడ్డి ఆశయాలు సాధించాలి


హుజూర్ నగర్ జనవరి 16 (జనంసాక్షి): అమరజీవి కాకి లక్ష్మారెడ్డి ఆశయాలు సాధించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మేకల నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు కోరారు. సోమవారం మండల పరిధిలోని అమర్ నగర్ గ్రామంలో కాకి లక్ష్మారెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం పేదవాడికి అండగా నిలిచిన కాకి లక్ష్మారెడ్డి జీవితాంతం నమ్మిన సిద్ధాంతాలకు అండగా నిలిచారని కొనియాడారు. అనంతరం కాకి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, కాకి లక్ష్మారెడ్డి స్మారక పురస్కారం 50వేల నగదు ములుగు భూపాలపల్లి జిల్లాలో ఎన్ కౌంటర్లో మృతి చెందిన మంతెన రాజు భార్య నవతకు కాకి లక్ష్మారెడ్డి స్మారక నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకి భాస్కర్, అజయ్ కుమార్, ఫరబ్ కుమార్, ప్రవీణ్ , క్రాంతి కుమార్, చంద్రం, రాకేష్, రాజేష్, దుర్గాప్రసాద్, నర్సిరెడ్డి, సుగుణ, కళావతి, సుస్మిత, నవత, విజయ్, కెఎల్ఎన్ రావు, అమరవీరుల బంధువుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే. శాంతి పాల్గొన్నారు