అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతి

శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మృతి చెందిన యాత్రికుల సంఖ్య 42కి చేరింది. శనివారం ఉదయం ఢిల్లీకి చెందిన పర్వీన్‌కుమార్‌ (32), బల్బీర్‌సింగ్‌(70)లు బ్రారీ మార్గ్‌, బల్తాల్‌లలో గుండెనొప్పితో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన కిలా బహన్‌ (52), జగ్‌దీష్‌ పురుషోత్తం దాస్‌ (77)లు శుక్రవారం రాత్రి బాల్తాల్‌లో మరణించారు. తిరుగుప్రయాణంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆనంద్‌ బొటిన్‌జెర్‌ (43) కూడా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ 25న ప్రారంభమైన ఈ యాత్రలో శుక్రవారం రాత్రి వరకు 2,57,747 మంది మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు.