అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతి

జమ్ముకాశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. జూన్‌ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్‌ యాత్రలో ఆదివారం సాయంత్రం వరకు 4లక్షల 82వేల 950మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రానికి మరో 10వేల మంది దర్శనం చేసుకున్నారు. భక్తుల మరణాలు ఎక్కువగా కార్డియాక్‌ అరెస్టు వల్ల సంభవిస్తుండడంతో అధికారులు వైద్య పర్షీల విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.