అమెరికాలో మంచు తుఫాను

ఓక్లహామ్‌సిటీ : ఉత్తర అమెరికా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం శక్తివంతమైన మంచుతుఫాను సంభవించింది. భారీ గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా ఆరుగురు మృతి చెందారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్టమస్‌ సంబరాలకు తీవ్ర విఘాతం కలిగింది. విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినడంతో వేల గృహాలకు  విద్యుత్‌ సదుపాయం నిలిచిపోయింది. రహదారులు మంచుతో నిండిపోయాయి. దాదాపు 1500 విమానాలు రద్దు చేశారు. మరికొన్ని  ఆలస్యమయ్యాయి.