అమెరికా తీర్మానాన్ని భారత్‌ బలపరచాలి : కరుణానిధి

చెన్నై : శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై ఐరాస మానవహక్కుల సమావేశంలో అమెరికా ప్రతిపాదించనున్న తీర్మానాన్ని భారత్‌ బలపరచాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని తమిళనాడు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.