అమెరికా నేవీ కాల్పుల్లో భారతీయుడు మృతి

దుబాయి: దుబాయి తీర ప్రాంతంలో అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ మత్య్సకారుడు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయి నైరుతి ప్రాంతంలోని జెబెల్‌అలీ పోర్టుకు 48కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. మృత్యున్ని తమిళనాడు రాష్ట్రానికి చెందిన రామచంద్రాపురం జిల్లాకు చెందిన శేఖర్‌గా గుర్తించారు. మత్స్యకారులు వెళ్తున్న బోట్‌ తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో కాల్పులు జరిపినట్లు అమెరికా నేవి వర్గాలు వెల్లడించాయి.

తాజావార్తలు