అరెస్ట్‌ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలి:జేఏసీ

హైదరాబాద్‌:  ప్రజాసమస్యలపై న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ డిమాండ్‌ చేసింది. రైతులు ఎదుర్కొంటున్న కరెంట్‌ సమస్యలపై ప్రభత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షను భగ్నం చేసి అరెస్ట్‌ చేయటం అక్రమమన్నారు. జేఏసీ నాయకులు ఈ రోజు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై సీఎంతో మాట్లాడుతానని మంత్రి హామి ఇచ్చారని వారు తెలిపారు.