అలబామా ఆసుపత్రిలో కాల్పులు.. ముగ్గురికి గాయాలు

బర్మింగ్‌హామ్‌: అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్‌లోని సెయింట్‌ విన్సెంట్‌ ఆసుపత్రిలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో ఓ వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్నాడే సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నామని.. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా కాల్పులు జరిపాడని బర్మింగ్‌హామ్‌ పోలీసు అధికారి జానీ విలియమ్స్‌ తెలిపారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను మృతి చెందినట్లు చెప్పారు.