అల్లుడిపై అత్తామామ దాడి

హైదరాబాద్‌: అల్లుడిపై అత్తామామ దాడి చేసిన ఘటన నాదర్‌గుల్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.