అవగాహన లేకుండా విమర్శలు చేయడం మంచిది కాదు

share on facebook
వలిగొండ జనం సాక్షి న్యూస్ ఆగస్టు 5 వలిగొండ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ  అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం నుండి తొర్రూరు వెళ్లే రోడ్డు ఆర్, ఎం, బి, డిపార్ట్మెంట్ నుండి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంటు  తీసుకోవడం జరిగింది  వలిగొండ మండలంలోని కొంతమంది నాయకులు స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిపై కావాలని వాట్సప్ గ్రూపులలో పోస్టులు పెట్టి విమర్శించే ముందు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు నేషనల్ హైవే రోడ్డు ప్రక్రియ లో భాగంగా 549 కోట్లకు టెండర్ ప్రక్రియ ద్వారా వి, డి, బి, కన్స్ట్రక్షన్ వారు తొందర్లో పనులు మొదలు పెడతారు ఇందులో ఒక కోటి 31 లక్షలతో రోడ్డు మరమ్మతులు ప్యాచ్ వర్క్ చేయనున్నట్లు తెలిపారు  భువనగిరి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణము అండర్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయని స్థాయిని మరిచి ఎమ్మెల్యేను విమర్శలు చేయడం అంత మంచిది కాదని ఆయన ఘాటుగా హెచ్చరించారు రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని వాట్సాప్ గ్రూప్ లలో పోస్టులు పెడితే ఇకముందు సహించేది లేదని హెచ్చరిస్తూ విమర్శలను  తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎలిమినేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Attachments area

Other News

Comments are closed.