అవినీతి సభలు : ముద్దుకృష్ణ

కడప : తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అవినీతి ఏరులై పారిందని తెదేపా  సీనియర్‌నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. కేవలం డబ్బులు సంపాధించుకునేందుకే తెలుగు మహాసభలుఉ ఏర్పాటు చేశారన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోజనాల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందన్నారు. అసలైన కవులు, కళాకారులను విస్మరించి కేవలం తమ అనుచరుల కోసమే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.