అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో కట్లుదిట్లమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి అసెంబ్లీ చుట్టు పక్కల నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలియజేశారు. సభ్యులకు మినహా ఇతరులను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి లేదని తెలియజేశారు.