అసెంబ్లీ లాబీలో పివి చిత్రపటం ఆవిష్కరణ

హైదరాబాద్‌,అక్టోబర్‌8 (జనంసాక్షి) : భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్‌రావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, స్పీకర్‌, ప్రొటెం చైర్మన్‌తో పాటు పలువురు పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభి వాణీదేవీ, ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు.