అహ్మదాబాద్‌కు బయలుదేరిన టీం ఇండియా

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే రెండో టెస్టుకు ఇరు జట్లు హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. మొదటి టెస్టు విజయంతో వూపు మీదున్న ధోనీ సేవ అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. రెండో టెస్టులోనైనా నెగ్గి తమ సత్తా చాటాలని న్యూజిలాండ్‌ జట్టు కూడా ఆశపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ నెల 31 అహ్మదాబాద్‌లో తలపడతాయి.