ఆందోళన విరమించిన మత్స్యకారులు

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు వద్ద మత్స్యకారులు తమ ఆందోళనను విరమించారు. ఆర్డీవో మాధవీలత వారితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హర్బర్‌ నిర్మాణం, సముద్రంలో చేపల వేటకు అనుమతి, తాగునీటి సదుపాయం..తదితర సమస్యల పరిష్కారానికి ఆర్డీవో హామీ ఇచ్చారు. 10రోజుల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి కలెక్టర్‌ సమక్షంలో పోర్టు యాజమాన్యం, మత్స్యకార సంఘం నాయకులతో చర్చలు జరుపుతామన్నారు.