ఆగని పెట్రో ధరల దాడి
న్యూఢల్లీి,నవంబర్2 జనంసాక్షి : దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం వరుసగా ఏడోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై రూ0.35 పెరగడంతో వరుసగా వాటి ధరలు ఢల్లీిలో పెట్రోల్ ధర రూ. 110.04కి, డీజిల్ రూ.98.42 కి పెరిగాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.85 కాగా, రూ. 106.62కి చేరాయి. పశ్చిమబెంగాల్, కోల్‌కతాల్లో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.49, రూ.101.56కి చేరగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.66 రూ.102.59గా ఉంది.