*ఆత్కూరు సర్పంచ్ సెక్రటరీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – సిఐటియు*
పెద్దేముల్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల కేంద్రంలో ఆత్కూరు గ్రామంలో గత అనేక రోజులుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష చూపెడుతూ గ్రామంలో పెట్టకుండా పెంట కుప్పల పై అవమానకరంగా పెట్టిన గ్రామ సర్పంచ్ సెక్రెటరీ పై చట్టపరమైన చర్య తీసుకొని ఊరు మధ్యలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ సెక్రెటరీ , సర్పంచ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా సర్పంచ్, సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఆ విగ్రహాన్ని ఊరి మధ్యలో పెట్టకుండా అడ్డుపడుతున్న వ్యక్తుల పై చర్య తీసుకోవాలని సర్పంచ్ సెక్రటరీ పైన వెంటనే మండలంఅధికారులు మరియు జిల్లా అధికారులు కలెక్టర్, ఎస్పీ చర్య తీసుకోవాలని, లేకపోతే మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.