ఆనం రాంనారాయణరెడ్డితో ముగిసిన ఖజానా శాఖ ఉద్యోగుల చర్చలు

హైదరాబాద్‌: సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజానా శాఖ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ఖజానా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి సానుకూలత చూసినట్లు సమాచారం. ఖజానా ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యిదర్శికి ఆనం ఆదేశాలు .జారీ చేశారు. దీంతో ఏపీ ఎన్జీవో సంఘం, ఖజానా శాఖ ఉద్యోగ సంఘాలతో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరుపుతున్నారు. పని నిరాకరణ సమ్మె విరమణ యోచనలో ఖజానా ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.