ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి

6 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం
కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా సైనికుల దుస్తులకు ధరించిన దుండగులు ఆయుధాలు, రాకెట్‌లతో స్థావరంపై దాడికి దిగారని లెఫ్టినెంట్‌ కల్నల్‌ హగెన్‌ మెస్సెర్‌ తెలిపారు. మూడు ఇంధనం నింపే కేంద్రాలపైనా దాడులు జరిగాయన్నారు. పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని నాటో పేర్కొంది. ఇదే స్థావరం నుంచి బ్రిటన్‌ యువరాజు హ్యారీ విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారమే ఆ బధ్యతలు తీసుకున్నారు.