ఆముదాలపల్లి మచ్చ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా రాజమౌళి.
..
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 18
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం లోని శంకరపట్నం మండలం ఆమదాల పల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షునిగా చింతల రాజమౌళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, సహకార శాఖ జూనియర్ ఇన్స్పెక్టర్, ఎస్ తిరుమల్ రావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి తిరుమల్ రావు మాట్లాడారు. అందాల పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆముదాల పల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశాన్ని నిర్వహించి సంఘం ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సంఘ సభ్యులందరూ హాజరై సమావేశంలో అధ్యక్షునిగా చింతల రాజమౌళి ,ఉపాధ్యక్షునిగా చొప్పరి రమేష్, కార్యదర్శిగా తరుణ్, సంఘం పాలకవర్గ సభ్యులుగా చింతల సంపత్, జునుగురి కనకయ్య, బంగారి రవి, బోనగిరి ఆంజనేయులు, హరీష్, సౌ తకారి సంపత్, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.