ఆయుర్వేదంతో మొండి వ్యాధులు నయం

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి):
ఆయుర్వేదం వైద్యంతో మొండి వ్యాధులను నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ చిరంజీవి నిపోలియన్‌ అన్నారు. స్థానిక రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రకృతిలోని పలు రకాల మొక్కలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. నరాలు చచ్చుపోవడం, పోలియో, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు తదితర రోగాలు అనంతరం సమారు 50 మందిని పరీక్షించి వారిలో పలువురికి తయిల మర్దన చేసి మందులు పంపిణీ చేశారు.