ఆరోవిడతలో 1800 ఎకరాల భూ పంపిణీ

ఖమ్మం, జూలై 10 : జిల్లాలోని పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గల పది మండలాల్లో 1800 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పాల్వంచ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించడం, భూమి లేని నిరుపేదలకు నమోదు చేయడం పూర్తయిందన్నారు. రెండవ విడత రచ్చబండలో పాల్వంచ డివిజన్‌ పరిధిలోని 10 మండలాల్లో 21,911 రేషన్‌కార్డులకు దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో పాల్వంచ పట్టణంలో 4552, మండలంలో 1850 దరఖాస్తులు వచ్చాయన్నారు. త్వరలో ఎన్నికల ప్రీ రివిజన్‌ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.