ఆశ వర్కర్లకు రు.18 వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి..!!

జనం సాక్షి /కొల్చారం
ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, పిక్స్ డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని కొల్చారం మండల ఆశ వర్కర్ల సంఘం నాయకురాలు గీత, రాములమ్మ, సౌందర్యలు అన్నారు. కొల్చారం బస్టాండ్ సమీపంలో ఆశ వర్కర్లు సోమవారం తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిరోధిక సమ్మె ను ప్రారంభించారు. . ప్రభుత్వం ఆశ వర్కర్ల బాగోగులు ఆలోచించి ఫిక్స్డ్ వేతనాన్ని చెల్లించాలన్నారు. రాత్రనక, పగలనకుండా ఇండ్ల వద్ద తమ పిల్లలను వదిలి పనిచేస్తున్న తమకు నామ మాత్రపు పారితోషకంతో సరిపుచ్చుకుంటున్నారన్నారు. నెలకు 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు గీత,లక్ష్మి, నాశమ్మ, రమ్య, సుశీల, లలీత, కవిత, విజయ, నాగమణి, నవనీత, కవిత, చంద్రకళ, సబిత, రాణి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్;
కొల్చారంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్న ఆశ వర్కర్లు

తాజావార్తలు