తప్పు చేయకపోతే భయమెందుకు?
` ఫోన్ ట్యాపింగ్ దోషులకు శిక్ష తప్పదు
` చేసిన తప్ప్పులు కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు
` కాంగ్రెస్ నేతల విమర్శలు
కామారెడ్డి/హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష తప్పదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎవరున్నా విచారణ జరుగుతుందని అన్నారు. ఈ కేసుపై ఆయన స్పందించారు. సిట్ విచారణపై హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ మండిపడ్డారు. చేసిన తప్ప్పు కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద నేరమని వ్యాఖ్యానించారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. తన ఫోన్, షబ్బీర్ అలీ సహా చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహేష్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలపై రాజకీయ వేధింపులకు పాల్పడే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. అలాగే బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాముడి, హిందు దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని.. ఎక్కడ ఎన్నికలు వచ్చిన అక్కడ హిందు, ముస్లింలకు బీజేపీ గొడవలు పెడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ నాయకులు జైశ్రీరాం అంటున్నారని విమర్శించారు. తనకు ఓటేసి గెలిపించిన ప్రజల కష్ట సుఖలను గాలికి వదిలేసి కేవలం ఓట్ల కోసమే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పని చేస్తున్నాడని దుయ్యబట్టారు. నిరుపేద ప్రజలకు ఉపాధిని కల్పించాలనే సదుద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హావిÖ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం కరెక్ట్ కాదన్నారు. గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ జనవరి 26 తరువాత ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తోందని నిప్ప్పులు చెరిగారు. కాంగ్రెస్ గొప్ప పార్టీ అని.. అలాంటి పార్టీలో ఉండటం అదష్టమని అన్నారు. కార్యకర్తల కషి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్ల బీఆరఎస్ పాలనలో నిర్భందలు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు కషి చేశారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని.. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక, ప్రతి గ్రామంలో సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాలనలో సర్పంచులదే మూడో స్థానమన్నారు.
అనీనిణతీవబబ: తప్పు చేయనప్పుడు భయమెందుకు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తది కాదని.. గత రెండేళ్లుగా దీనిపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. హరీశ్‌రావు పోరాటయోధుడిలా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు. “ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవిత వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారని హరీశ్ బాధపడిపోతున్నారు. బీఆరఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిని ఎలా వేధించారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎన్నో కేసులు పెట్టి ఆయన్ను అణగదొక్కాలని చూశారు. సీఎంపై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు” అని అయిలయ్య అన్నారు.హరీశ్‌రావుకు నిజాయతీ ఉంటే తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోలేదని ప్రమాణం చేయగలరా? అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. తప్పు చేయకపోతే ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన బాధితుడైతే సంబంధిత వివరాలను సిట్‌కు తెలపాలని.. బాధ్యుడైతే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “అధికారులతో తప్పుడు పనులు చేయించి తెలంగాణను అభాసుపాల్జేశారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం కావడానికి కేసీఆర్ కారణం. మేం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే బీఆరఎస్ నేతలు బయట తిరగలేరు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది”అని దయాకర్ అన్నారు. హరీశ్‌రావు సిట్ విచారణకు వస్తూ హడావుడి ఎందుకని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది ఇబ్బందిపడ్డారని చెప్పారు. తప్పు చేయనప్పుడు భయమెందుకన్నారు.



