హరీశ్‌పై ప్రశ్నల వర్షం

` నాపై కక్ష సాధిస్తున్నారు.
` పైవాళ్లు రాసిచ్చినవే అడిగారు
` సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం
` ఫోన్ ట్యాపింగ్‌లో నిరాధార ఆరోపణలు
` సింగరేణి వ్యవహారంతో దష్టి మరల్చేందుకే కుట్ర
` విచారణ అనంతరం మీడియా సమావేశంలో హరీశ్
` దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించిన సిట్
హైదరాబాద్(జనంసాక్షి): కేసులు, అరెస్టులు మాకు కొత్త కాదని.. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిట్టు, లట్టు, పొట్టుకు మేం భయపడమని.. సిట్ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. మంగళవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు విÖడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాపై నిరాధార ఆరోపణలు చేశారని.. విచారణ పేరుతో సమయం వధా చేశారని అన్నారు. నోటీసులు వస్తే పారిపోమని.. ఎన్ని విచారణలు అయినా ఎదుర్కొంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సమైక్య రాష్ట్రంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడుతున్నారని.. కేసులు, అరెస్టులు మాకు కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారిందని.. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశాడని.. ఈ స్కామ్‌ను బట్టబయలు చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. దమ్ముంటే నన్ను విచారణ చేసినప్ప్పుడు తీసిన వీడియో బైట పెట్టాలని.. అంతే కానీ చిల్లర లీకులు ఇవ్వొద్దని అన్నారు. ఇది లీకుల ప్రభుత్వం, స్కాముల ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు ముందే ఉన్నాయన్నారు. ఇదిలావుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. హరీష్ రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి నేరుగా ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సోమవారం హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసుల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. సిట్ చీఫ్ సజ్జనార్ నేతత్వంలో దాదాపు ఏడు గంటల పాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విÖ పాత్ర ఏంటి..? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయించారని సిట్ ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీశ్ రావును సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీశ్ రావు అనుచరులను పంజాగుట్ట పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. సిట్ కూడా వారి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసినట్టు తెలిసింది. ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎసఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైన మాజీ పోలీస్ అధికారుల వాంగ్మూలాలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 నంబర్లకు చెందిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆరఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌ను ఇప్పటికే విచారించింది. వాళ్ల నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలు సేకరించింది.
రేవంత్ రెడ్డి తాటాకు చప్ప్పుళ్లకు భయపడను
రేవంత్ రెడ్డి తాటాకు చప్ప్పుళ్లకు భయపడనని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి, ఇవాళ సిట్ విచారణకు వెళ్తున్నానని పేర్కొన్నారు. సిట్ విచారణకు బయల్దేరి వెళ్లేముందు హైదరాబాద్‌లోని కోకాపేట నివాసం వద్ద హరీశ్‌రావు విÖడియాతో మాట్లాడారు. నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని హరీశ్‌రావు తెలిపారు. దండుపాళ్యం ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టానని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయట పడితే నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని.. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నామని తెలిపారు. తాము తెలంగాణ ఉద్యమకారులమని.. కేసీఆర్ తయారుచేసిన సైనికులమని తెలిపారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి. మహిళలకు మహాలక్క్ష్మీ ఏమైంది. అవ్వతాతలకు రూ.4వేల పింఛన్ ఎప్ప్పుడు ఇస్తావని అడిగామని హరీశ్‌రావు తెలిపారు. హిల్ట్ పాలసీ, పవర్ స్కాం, భూ కుంభకోణాలు బయటపెట్టినామని పేర్కొన్నారు. నీ వాటాల విషయం ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావని మండిపడ్డారు. కష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా కట్టబెడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోక నీ బండారం బయట పెట్టినామని తెలిపారు. అసెంబ్లీ లోపల, బయట నిలదీసినామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని.. మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చావని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తామంటున్నారని.. పట్టణాల్లో వడ్డీలేని రుణాలు ఇస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. మాకు నోటీసులు ఇచ్చి, ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. బీఆరఎస్ ఒత్తిడిని సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేక పోతున్నాడని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయని అన్నారు. 40 శాతం స్థానాల్లో బీఆరఎస్ విజయం సాధించిందని అన్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అంటున్నాడని మండిపడ్డారు. రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డి ఇదే డ్రామా ఆడుతున్నాడని తెలిపారు. గతంలో నాపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే, సుప్రీంకోర్టు చెంప చెల్లుమని పించేలా తీర్పునిచ్చిందని అన్నారు. న్యాయం మావైపు ఉంది కాబట్టి హైకోర్టులో కూడా గెలిచామని తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిందని.. ఇదే సీరియల్ ఇంకా ఎన్ని రోజులు నడుపుతావని మండిపడ్డారు. నువ్వు ఎన్ని డైవర్షన్లు చేసినా విÖ స్కాంలు బయటపెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆంధ్రాకు అమ్ముడుపోయిన దానిపై నిలదీస్తూనే ఉంటామన్నారు. బొగ్గు స్కాంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యింది నిజం కాకపోతే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తన బామ్మర్దితో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్న స్కాంపై విచారణ జరిపించాలన్నారు. నైనీ బ్లాక్ ఒక్కటే కాదు.. అన్ని టెండర్లను రద్దు చేయాలన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. బీజేపీ వెంటనే స్పందించి దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేశారు. సింగరేణి డబ్బులతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతున్నాడని.. షోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ విÖద తనకు నమ్మకం ఉందని హరీశ్‌రావు తెలిపారు. నేను తప్ప్పు చేయలేదు.. కేవలం బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. ఇది రాజకీయ డ్రామా అని అన్నారు. మేం భయపడం.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసినా సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. నీ అవినీతి కుంభకోణాలు బయటపెడతామని.. తెలంగాణ ప్రజల పక్షాణ ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.