ఆస్తి పన్ను చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి

మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్
రైస్ మిల్లులను తనిఖీ చేసిన కమిషనర్
చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 01 : ఆస్తి పన్ను చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జీ.రాజేంద్ర కుమార్ సూచించారు. గురువారం చేర్యాల మున్సిపాలిటీ కమీషనర్ రాజేంద్ర కుమార్ అధ్వర్యంలో పట్టణంలోని రైస్ మిల్లులను ట్రేడ్ లైసెన్స్ తో పాటు ప్రాపర్టీ టాక్స్ చెల్లింపుల విషయంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలో ఏ ఒక్క రైస్ మిల్లు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా, రైస్ మిల్లుల కనీసం ప్రాపర్టీ టాక్స్ లు కట్టకుండా ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అందరూ తప్పనిసరిగా ఆస్తి పన్ను చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నతర్వాతనే వ్యాపారాలు చేసుకోవాలని హెచ్చరించారు. శనివారం రోజులోగా చెల్లించాలని గడువు పెట్టారు. లేని పక్షంలో వారి వ్యాపార సంస్థలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జె.ప్రభాకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.