ఇంజినీరింగ్‌ ఫీజు విషయంలో ఏబీవీపీ నిరసన

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యకు దేశంలో ఎక్కడా లేని విధంగా 69 రకాల ఫీజులు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్యవర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన అద్థరాత్రి జీవో 639 ఉపసంహరించుకోవాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశ్‌ రావును కోరారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.