ఇంటి పన్ను వసూలుకు కొత్త సాఫ్ట్ వేర్
హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్ను వసూలుపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడాది నుండి ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంటి పన్నును వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో పైరవీలకు చెక్ పెట్టాలని చూస్తోంది ప్రభుత్వం. నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన ఆస్తి పన్నును కింది స్థాయి సిబ్బంది వసూలు చేయడంలేదనే అభిప్రాయంతో వుంది ప్రభుత్వం.
టాక్స్కంటేతక్కువవసూలుచేస్తున్నఅధికారులు…..
ప్రస్తుతం ఇంటిపన్ను వసూలు చేస్తున్న అధికారులు ఉన్న టాక్స్ కంటే తక్కువ వసూలు చేస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో అలర్టయిన ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఇంటి వైశాల్యం ఎంత? ఎన్ని ఫ్లోర్లున్నాయి ? లాంటి అంశాలను పొందుపరుస్తారు. సంబంధిత ఇంటి వివరాలు ఎంటర్ చేయగానే.. ఇంటి పన్ను ఎంత చెల్లించాలో డిస్‌ప్లే అవుతుంది. ఆ ఇంటి యజమాని కంప్యూటర్ లో వచ్చిన బిల్లును ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది.
మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లోనువసూలుకానిఇంటిపన్నులు…..
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇంటిపన్ను వసూలు కావడం లేదు. ఇంటి పన్ను వసూలులో 2014-15తో పోల్చుకుంటే 15-16లో అనుకున్న టార్గెట్ కన్నా తక్కువ లక్ష్యాలను సాధించింది Ghmc. మిగతా పట్టాణాల్లో 283 కోట్లు లక్ష్యంగా పెట్టుకొంటే.. 243 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం 99.99 శాతం వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.
మణుగూరు, మెట్‌పల్లి, కరీంనగర్, సిద్దిపేట…..
మణుగూరు, మెట్ పల్లి, కరీంనగర్, సిద్దిపేట,మహబూబ్ నగర్, జనగాం 99 శాతం పైగా పన్ను వసూలులో టాప్ 10 లో ఉన్నాయి. ఇక మిగిలిన నగర పంచాయితీలు, మున్సిపాలిటీల్లో మాత్రం 70 శాతం నుండి 30 శాతం వరకు మాత్రమే వసూలు అయ్యాయి. ఇదే సీన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా రీపీట్ కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త సాప్ట్ వేర్ ను తెరపైకి తెచ్చింది.
కొత్త సాప్ట్ వేర్ తో ఖచ్చితంగా ఇంటిపన్ను వసూలు…
పంచాయతి కార్యక్రమంలో భాగంగానే ఈ కొత్త సాప్ట్ వేర్ ను తీసుకొస్తున్నట్లుగా సెక్రటేరియట్ లో ఐటి అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అనుకున్నప్పటికీ మరికొన్ని రోజుల టైం పట్టే చాన్స్ వుందంటున్నారు. ఏదిఏమైనా ఈ కొత్త సాప్ట్ వేర్ తో ఖచ్చితంగా ఇంటిపన్ను వసూలు చేస్తామంటున్నారు పంచాయతిరాజ్ శాఖ అధికారులు.