ఇండియాగేట్ వద్ద నిషేదాజ్ఞలు
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధానిలో నిరసనలు మిన్నంటడడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్నటి నుంచి విజయ్‌చౌక్ వద్ద ఆందోళనకుదిగిన నిరసనకారులను ఖాళీ చేయించారు. ఇండియా గేట్ పరిసరాల్లో నిషేదాజ్ఞలు విధించారు. సమీపంలోని 7 మెట్రో స్టేషన్లను మూసివేశారు. పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పెద్దఎత్తున భద్రతా దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.