ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

జకార్తా: భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా..20 మంది గల్లంతైనట్లు సమాచారం. భారీ వర్షాలకు మామస జిల్లాలోని బటంగూరు గ్రామం సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. విరిగిపడ్డాయి. దీంతో నది ఆనకట్ట కొట్టుకుపోయి. సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటివరకూ 10 మృతదేహాలను వెలికితీశామని .. గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలియజేశారు.