ఇండోనేషియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన సైనా

ఇండోనేషియా : బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరిసీలో ఫ్రీ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన యుస్వందరిపై సైనా 21-17, 14-21, 21-13 తేడాతో గెలిచింది. గంట సేపు జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ కొంత శ్రమపడాల్సి వచ్చింది. తొలి గేమ్‌ను అతికష్టంగా గెలిచిన సైనా రెండో గేమ్‌లో ఓడిపోయింది. కీలకమైన మూడో గేమ్‌లో పుంజుకుని 21-13తో గెలిచింది.