ఇక మానవ రహిత జెట్‌ యుద్ధ విమానం

లండన్‌, జూలై 5 (జనంసాక్షి):

పైలెట్‌ లేని జెట్‌ యుద్ధ విమానాలను ప్రవేశం నిజం కాబోతోంది. ఇలాంటి కొత్త విమానాన్ని వచ్చే సంవత్సరం పరీక్షించనున్నట్టు బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ ప్రకటించింది. ఇది డ్రోన్‌ అంటే మానవరహిత చిన్న విమానం కాదు. పూర్తి స్థాయి పెద్ద విమానం. డ్రోన్‌కు కనీసం 20 రెట్లు పెద్దది కావచ్చు. దీన్ని రోబో విమానంగా చెప్పవచ్చు. మరింత విస్తృతమైన పరికరాలు, సామర్థ్యాలు దీని కుంటాయని కంపెనీ చెప్పింది. 24 గంటలూ ఆకాశంలో ఎగురకలదు. అసలు మానవమాత్రుడు ఈ విమానంలో ఉండడు. ఈ వివరాలను డైలీ మెయిల్‌ పత్రిక ప్రచురించింది. కొత్త సైన్స్‌ అయిన రోబో ఇంటెలిజన్స్‌ను ఇందులో ప్రవేశపెడతారు. ఈ ప్రయోగం విజయవంతమైతే యూకేలో పైలట్లు అక్కరలేదు. ఈ సాంప్రదాయిక అత్యంత అధునాతనమైన ఎఫ్‌-15 జెట్‌ యుద్ధ విమానాలకు ఇక కాలం చెల్లుతుంది. ఈ విమానానికి ‘ది మాంటిస్‌’ అని పేరు పెట్టారు. 2013లో బ్రిటన్‌ గగన తలంలో మొదటి సారిగా ఎగురుతుంది. అప్పుడు ప్రయోగాత్మక పరీక్షలు అన్నీ నిర్వహిస్తారు.