ఇది ప్రజావిజయం : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసిన బరాక్‌ ఒబామా తన విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇది అమెరికా ప్రజల విజయమని అన్నారు. మనదంతా ఒకే అమెరికా కుటుంబమని చెప్పారు. ఈ విజయం మీ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన చర్చలో పాల్గొన్న ప్రతిసారి దేశాన్ని ఉమ్మడిగా ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపైనే మాట్లాడానని చెప్పారు. పార్టీలు వేరైనా దేశాభివృద్ధి కోసం రోమ్నీతో కలిసి పనిచేస్తానని చెప్పారు.