ఇనుప గనుల తవ్వకాలపై పక్షికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కర్ణాటకలో ఇనుప ఖనిజం గనుల తవ్వకాలపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. లీజు నిబంధనలు ఉల్లంఘించని కంపెనీలకు మాత్రమే వర్తించేలా నిషేధాజ&ఙల్ని సడలించింది. కూటగిరీ-ఎగా వర్గీకరించిన 45 లీజుల్లో తవ్వకాలకు అనుమతించవచ్చని సీఈసీ సఫారసు చేసింది. ఈ 45 లీజుల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. ఈ నివేదికనే జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలమ్‌ నేతృత్వంలో అటవీ వ్వవహారాలపై ఏర్పాటైన ధర్మాసనం ఆమోదం తెలిపింది. షరతులకు లోబడి కేటగిరీ-ఎ లీజుల కంపెనీలు తవ్వకాలను నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఇతర లీజులపై నిషేదం కొనసాగుదుందని స్పష్టం చేసింది.