ఇళ్లపైనుంచి హైటెన్షన్‌వైర్లు తొలగించాలని ధర్నా

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని మేడారం గ్రామాస్థులు విద్యుత్‌ తీగలు పదేపదే తెగిపడుతుండటంతో భయంభయంగా ఉంటున్నామని ఇళ్లపైనుంచి హైటెన్షన్‌ వైర్లను తొలగించాని డిమాండ్‌ చేస్తూ ధరన్మారం-పెద్దపల్లి రహదారిపై ధర్నా చేశారు. ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలగిస్తామని విద్యుత్‌ ఏడిఈ శ్రీనివాస్‌ హామి ఇవ్వటంతో ఇందోళన విరమించారు.