ఇళ్లు లేని వారికి కొత్తగా ఇళ్లు: సోమేష్ కుమార్

someshహైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్లు లేని వారిని 2 లక్షల మంది వరకూ గుర్తించామని కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. 10టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గూడు లేని వారికి కొత్తగా ఇళ్లు నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ నగరాన్ని క్లీన్‌ సిటీగా మారుస్తామన్నారు. మేలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.