ఇవి ప్రజా సంక్షోభ ప్రభుత్వాలు…

ేలింఏంకొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదు..ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నడు..దీనికి తోడు మళ్ల కేంద్రం సామాన్యుడి నెత్తిపై డీజిల్‌ భారం వేసింది..సామాన్యుని నడ్డి విరిసింది..బడుగుల నెత్తిపై గుది బండ పడేసింది…ఆమ్‌ ఆద్మీ అంటూ బడాయిలు చెప్పుకొనే యూపీఏ సర్కార్‌ తమది అమీర్‌ ఆద్మీ నినాదం అని మరోసారి రుజువు చేసుకుంది..ఇప్పటికే అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే ఇపుడు ఈ ధరల పెంపు వల్ల మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టయింది…ఈ పెంపు సామాన్యుడికి శరాఘాతంలా తగిది…అధికారంలోకి వచ్చిందే తడవుగా తమకు పెంచుడే తెలుసన్నట్టుగా ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటనే పోతాంది..సామాన్యుడు ఏమయితే మాకేం అన్నట్లు ఉంది ప్రభుత్వం వ్యవహారం..ప్రజల బాధలు..భాగస్వామ్యుల ఒత్తిడులు..విపక్షాల నిరసనలు ఇవేవీ వినిపించనట్లు వ్యవహరి స్తుంది..దేశంలో సంస్కరణలకు బ్రేక్‌ పడిందంటూ ప్రధానిగా మన్మోహన్‌ ఫెయిలయ్యారంటూ వాషింగ్టన్‌ పోస్టు ప్రకటించిన వారంలోనే ఏదో చేసేద్దామన్న తీరుగా ప్రధాని ఆగమాగం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నడు…గతంలో డీజిల్‌ ధరను పెంచు తామంటూ  ఆర్థిక సలహా మండలి ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించు కోని పిఎం ఇపుడు మాత్రం ఏదో చేయాలన్న ఆత్రుతతో డీజిల్‌ ధరలు ఒక్క సారిగా 5 రూపాయల మేర పెంచేందుకు నిర్ణయం తీసుకున్నడు..ఇక సంవత్సరానికి ఆరు సిలిండర్‌లు మాత్రమే సబ్సిడీపై ఇస్తామంటూ ఆ తర్వాత కావాలంటే ప్రజలు మార్కెట్‌ ధరకే కొనుక్కోవాలని నిర్ణయించేసిండ్రు..అంతేనా తెల్లారే ప్రతి పక్షాల నిరసనకు తలొగ్గి వాయిదా వేసిన దేశంలోకి చిల్లర వ్యాపారంలోకి ఎఫ్‌ఢిఐల ప్రవేశంపై గేట్లెత్తేశారు..అయితె దీని వల్ల సామాన్యుడిపై పడే భారం సంగతి ఎలా ఉన్నా డీజిల్‌ ధరల పెంపు వల్ల మాత్రం సామాన్యుడిపై తీవ్ర భారం పడుతుంది..యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోలు డీిజల్‌ ధరలు పెంచడం పాతికిసార్లకు పైగానే జరిగింది. గత ఏడాది జూన్‌లో డీిజిల్‌ ధర పెంచింది. అప్పట్లో లీటరుకు రూ.3.37పైసలు చొప్పున వడ్డిం చింది. ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా రూ. 5లకు పెంచేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్నులు కలిపితే నికరంగా పెంపు రూ.6లకు చేరుకుంటుంది. ఒక్కొక్క ఏడాదికి ఇలా ధరలు పెంచుతుంటే ప్రజాసంక్షేమాన్ని కోరే ప్రభుత్వమా లేక కార్పొరేట్‌ సంస్థా అనే అనుమానం కలుగుతుంది. దురదృష్టవశాత్తు ఈనాటి ప్రభుత్వాలకు ప్రజా సంక్షేమంపై శ్రద్ధ కొరవడింది. డీిజిల్‌ ధర పెరిగితే సామాన్యుడిపై పడే  భారాలు అన్నీ, ఇన్నీ కావు. డీిజిల్‌ ధర పెంపుతో ప్రజారవాణా, సరుకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీంతో మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఇంకా పైపైకి పోక తప్పదు. దీనికి తోడు గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీని కుదించ డటం సంపన్నులకే కాదు మధ్యతరగతుల వారికి సైతం శరాఘా తమే. భార్య, భర్త ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబానికి సైతం సంవత్సరానికి ఎనిమిది సిలిండర్లు అవసరమవుతాయి. ఆరుకు మించి ఏడవ సిలిండర్‌ బుక్‌చేస్తే ఇక సబ్సిడీ హుళక్కే. ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వ ఒక్కొక్క సిలిండర్‌కు రూ.347కు సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడే ప్రభుత్వం కిరికిరి పెట్టింది..ఓ తెలివైన మెలికతో కేంద్రం రూ.20,300 కోట్ల సబ్సిడీ మిగుల్చుకుంది. పార్లమెంటు స్థాయి కమిటీ సిఫార్సు మేరకు సిలిండర్ల సరఫరాపై పరిమితిని విధించామని చెబుతూ ఆ నెపాన్ని దానిపై నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది..అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయంటూ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచే చమురు కంపెనీలు తగ్గినపుడు తగ్గించడం మాత్రం చేయడం లేదు..ఎంత సేపు చమురు కంపెనీలకు నష్టాలొచ్చాయంటూ ఊదరగొట్టే ప్రభుత్వం పేదోడి కష్టాల గురించి పట్టించుకొనేదెపుడు..అసలు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి చర్యలు చేపట్టేది కాదు…ఆర్థిక వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని చెప్పే కేంద్రం దేశ జనాభాలో అధికంగా ఉండే సామాన్యుడి జీవనస్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వ నిర్ణయం మార్కెట్లకు సానుకూలంగానే ఉండవచ్చుగానీ ప్రభుత్వ సంస్కరణలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తగ్గింప చేస్తుంది. భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తమను సంప్రదించకుండానే కేంద్రం ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస,్‌ ఎస్పీ బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేద, సామాన్య వర్గాల స్థితి గతులను, వారి కష్టాలను అర్థం చేసుకోకుండా పెంచుకుంట పోతే ప్రభుత్వాన్ని దించుతం అని సామాన్యుడు అనే పరిస్థితి రావొచ్చు..అదే జరిగితే ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డట్టే..