ఏసీబీకి చిక్కిన ఎస్సై పరార్‌

 

 

 

 

 

 

టేక్మాల్‌, నవంబర్‌ 18(జనంసాక్షి):మెదక్‌ జిల్లా టేక్మాల్‌ ఎస్సై రాజేశ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం… వరి కోత యంత్రానికి సంబంధిం చి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ వ్యక్తి నుంచి ఎస్సై రాజేశ్‌ రూ.40వేలు డిమాండ్‌ చేశాడు. ఈ నెల 13న ఫోన్‌పే ద్వారా రూ. 10 వేలు తీసుకోగా మంగళవారం రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులతో పెనుగులాడి తప్పించుకుకున్న ఎస్సై పోలీస్‌ స్టేషన్‌ భవనం నుంచి దూకి పొలాల మీదుగా పారిపోయాడు. అరగంటకు పైగా సినీ ఫక్కీలో ఏసీబీ అధికారులు ఛేజింగ్‌ చేసి మార్కెట్‌ సమీపంలోని పొలాల వద్ద డబ్బులను పారవేయడానికి ఎస్సై ప్రయత్నించగా పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

 

సికింద్రాబాద్‌లో రెవెన్యూ సర్వేయర్‌..

బేగంపేట్‌: కోర్టు వివాదంలోని స్థలాన్ని డీ మార్కేషన్‌ చేయకుండా ఉండేందుకు రూ.లక్ష డిమాండ్‌ చేసిన సర్వేయర్‌, అతడి సహాయకుడిని ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ తహసీల్‌ ఆఫీస్‌లో పనిచేసే కిరణ్‌ సర్వేయర్‌.. మినిస్టర్‌ రోడ్డులోని ఓ స్థలం పార్కు స్థలమో కాదో సర్వే చేసేం దుకు వెళ్లాడు. సర్వే చేయకుండానే మంగళవారం చైన్‌మెన్‌ పంపి సదరు యజమాని నుంచి లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన ఏఈ

గోపాల్‌పేట: రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్తు ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘ టన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. ఏదుల మం డలానికి చెందిన ఓ రైతు తన పొలానికి ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు కోసం గోపాల్‌పేట ఏఈ హర్షవర్ధన్‌రెడ్డిని సంప్రదించగా రూ.40 వేలు డిమాండ్‌ చేశారు. మంగళవారం రూ.20 వేలు ఇస్తుండగా దొరికారు.