మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

 

 

 

 

 

సదాశివపేట నవంబర్19(జనం సాక్షి)పెద్దాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రభాకర్ భార్య ఇటీవల మృతి చెందగా, మృతురాలి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, మాజీ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, పెద్దాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, మండల యువత అధ్యక్షుడు నరేష్ గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బేగరి సుధాకర్, గ్రామ మాజీ ఎంపీటీసీ రాములు,మాజీ సర్పంచులు రాదేశం పంతులు, అంజయ్య,గ్రామ పార్టీ అధ్యక్షుడు సామెల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు