ఇసుక మాఫియా దౌర్జన్యం

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచెల వద్ద ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్‌, వీఆర్వోలపై ఇసుక తరలిస్తున్న సిబ్బంది. దాడికి దిగారు. అధికారులను లారీ కిందికి తోసివేశారు. తహాసీల్దార్‌ శ్రీనివాస్‌,. మరో నలుగురు వీఆర్వోలు తృటిలో ప్రమాదం నుంచి తప్పంచుకున్నారు. వెంటనే నందిగామ పోలీసుస్టేషన్‌లో ఘటనపై ఫిర్యాదు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 6 లారీలను అధికారులు జప్తు చేశారు.