ఈడీకి చార్జిషీట్లు ఇచ్చేందుకు సీబీఐ అంగీకారం

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి 2,3 చార్జిషీట్లు ఇచ్చేందుకు నాంపెల్లి సీబీఐ కోర్టు అంగీకరించింది. అలాగే ఎమ్మార్‌ అనుబంధ చార్జిషీట్ల సైతం ఇచ్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. సంబంధిత చార్జిషీట్ల కాపీలను ఈడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.  మరోవైపు ఈ రెండు కేసుల్లో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న వారిని విచారించేందుకు అనుమతివ్వాలన్న ఈడీ పిటిషన్‌ను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది. కాగా, ఈడీ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.