ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

విజయవాడ: అజిత్‌సింగ్‌ నగర్‌లోని దేవినేని గాంధీపురానికి చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు సింగ్‌నగర్‌లో నిరుపయోగంగా ఉన్న శ్రీరామాఎనర్జీ ప్లాంట్‌లోని వాటర్‌ గ్యాలియర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఈతగాడి సాయంతో రవీంద్రారెడ్డి(16), కె.శ్రీకాంత్‌(16) మృతదేహాలను బయటకు తీశారు. నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. రవీంద్రారెడ్డి చైతన్య కళాశాలలో, శ్రీకాంత్‌ సిద్దార్ధ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు.