ఈనెల 9 నుంచి జాతీయ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్ షివ్ పోటీలు
హైదరాబాద్: ఈనెల 9 నుంచి 16 వరకు జీవీకే అస్టా 17 వసీనియర్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్‌షివ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఏపీ సీనియర్ టెన్నిస్ క్రీడాకారుల సంఘం తెలిపింది. ఎల్‌బీ స్టేడియంలోని శావ్ కాంప్లెక్స్‌లో నిర్వహించే పోటీలకు దేశ నలుమూలల నుంచి 5 వందల మంది క్రీడాకారులు పాల్గొంటారని సంఘం ప్రతినిధులు తెలియజేశారు. పోటీలను క్రీడా శాఖ మంత్రి వట్టి వసంతకూమార్, డీజీపీ దినేశ్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. 45,55,65వయసు గల క్రీడాకారులకు సింగిల్, 75 వయసువారికి డబుల్స్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గెలుపొందిన క్రీడాకారులకు 10 లక్షల రూపాయల బహుమతి ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.