ఈ ఏడాది మహనాడు వాయిదా వేసిన టీడీపీ

హైదరాబాద్‌: ఈ రోజు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సామావేశం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేయాడానికి పార్టీనిర్మాణం గూర్చి చర్చించారు ఈ నెల తేది20 నుంచి 30వ తేది వరకు గ్రామాల్లో గ్రామ, వార్డు కమిటీ ఎన్నికలు నిర్వహించాలని, అగస్ట్‌ 5నుండి 20వ తేది వరకు మండల పార్టీ అనుబంధ కమిటీల ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. అయితే మహనాడుపై చాలా సేపు చర్చించి  ఈ సంవత్సరం నిర్వహించ వద్దని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం మే నెలలో మహనాడు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.