ఈ నెల 26 పీసీసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 26న ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమీటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ , జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొంటారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.