ఈ మట్టికుప్పను తొలగించేదెప్పుడో?

హుస్నాబాద్‌ (జనంసాక్షి):
నగరంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిలువ ఉంచిన మట్టి కుప్ప వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చౌరస్తాలోని రోడ్డు మరమ్మత్తు పనుల -లో భాగంగా మట్టిని తవ్వి కుప్ప వేశారు. ఇది దా దాపు 20 రోజుల నుంచి నిలువ ఉంటుంది. దానితో రోడ్డుపై వెళ్లే పాదచారులకు, వాహనదా రులకు, రో డ్డు ప్రక్కన గల చిరువ్యాపారులకు, దుకా ణాదారుల కు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. మట్టికుప్ప వల్ల వాహనా ల రాకపోకలతో దుమ్ము అధికంగా లేచి తిను బండారాలపై పడుతుంది. ఇలాగైతే తమ వ్యాపారం ఎలా కొనసాగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబందిత అధికారులు వెంటనే స్పందించి మట్టికుప్పను తొలగించాలని పలువురు కోరారు.