ఉద్యమకారులపై పోలీసులు తప్పుడు కేసులు

బనాయిస్తున్నారు : కేజ్రీవాల్‌
ఢిల్లీ, జనంసాక్షి :
ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ నింది తులను శిక్షించాలని కోరుతూ ఉద్యమిస్తున్న వారిపై పోలీసులు తప్పు డు కేసులు బనాయిస్తు న్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అర వింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపిం చారు. ఆందోళనలో కాని స్టేబుల్‌ మృతికి కారణమ య్యారం టూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎనిమిది అరెస్టు చేశారని పేర్కొన్నారు. మనీశ్‌ శిశోడియా మాట్లాడుతూ మీడియాను తప్పుదోవ పట్టించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. కానిస్టేబుల్‌ మృతి చెందడం దురదృష్టకరమని, ఇందుకు కారణమైన వారిని పట్టుకుని శిక్షించాలని కోరారు. అమాయకులపై కేసులు బనాయించడం సరికాదని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.