ఉద్యమ స్వరూపం మారాలె..

ఈజిప్టు తరహా ఉద్యమాలు రావాల
– ప్రజా గాయకుడు గద్దర్‌
హుస్నాబాద్‌్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) :
ప్రస్తుత కాలంలో సాగుతున్న ఉద్యమాల స్వరూపం మారా ల్సిన అవసరముందని, ఈజిప్టు దేశంలో నాయ కత్వ మార్పు కోసం సాగిన పోరాటం తరహా ఉద్యమాలు రావాలని ప్రజా గాయకుడు గద్దర్‌ అభిలషించారు. లక్ష్మింపేటలో దాడికి గురైన దళితులకు ఆహార పదార్థాలను పంపించే కార్య క్రమం శనివారం హుస్నాబాద్‌లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దర్‌ మాట్లాడు తూ ప్రపంచంలో ఉద్యమాలు భూమి, నీళ్లు, అధికారం దోపిడీకి గురైనప్పుడే ఉద్భవి స్తాయన్నారు. లక్ష్మింపేట దళితుల ఆరాటమైనా, తెలంగాణ ప్రజల పోరాటమైనా వాటికి వ్యతిరే కంగానే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. లక్ష్మింపేట హింసాకాండను అందరూ ఖండించా లని, బాధితులకు తమ వంతు సాయాన్ని అందించాలని గద్దర్‌ పిలుపునిచ్చారు. పోరాటాల్లో అమరులైన వాళ్లకు నివాళులు అర్పించడమే గాక, వాళ్ల ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. భూస్వాముల కబంద హస్తాల్లో ఉన్న భూమిని పేదలకు పంచేలా పోరాటాలు చెయ్యమని గద్దర్‌ ప్రజలనుద్దేశించి నినదించారు. అవసరమైతే ఈ పోరాటాల్లో పాల్గొనే ప్రజలకు బిచ్చమెత్తైనా బువ్వ పెడతామని భరోసా కల్పించారు. అవకాశవాద రాజకీయ శక్తులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం గద్దర్‌ లక్ష్మింపేట బాధి తుల కోసం సేకరించిన నిత్యావసన సామగ్రిని దళిత సంఘాల నాయకులతోపాటు ర్యాలీగా బయలుదేరి స్థానిక కొరియర్‌ కార్యాలయం నుండి పంపించారు.
హుస్నాబాద్‌లో ఈ కార్య క్రమ ఏర్పాటుకు కృషి చేసిన ఒసుకుల సుధా కర్‌ను గద్దర్‌ అభినందించారు. తరువాత అంబే ద్కర్‌ విగ్రహా నికి పూలమాల వేసి జోహార్లు అర్పిం చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రం ట్‌ జిల్లా కన్వీనర్‌ మేకల వీరన్న యాదవ్‌, దళిత సంఘాల నాయకులు కేడం లింగమూర్తి, బత్తుల చంద్రమౌళి, తొందూరి ఎల్లయ్య బహుజన్‌, గడిపె కొమురయ్య, కండె సుధాకర్‌, వెన్న రాజు, బూరుగు యాదగిరి తదితరులున్నారు.