ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన

న్యూఢిల్లీ:దేశరాజధానిలో చోటుచేసుకున్న  అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద చేపట్టిన విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది సంఖ్యలో  ఇండియా గేట్‌ వద్ద చేరుకున్న విద్యార్థులు  నిరసన ప్రదర్శనకు దిగి వారిని అడ్డుకున్నారు.  అయితే పోలీసు బారికేడ్లను దాటుకొని వేళ్లేందుకు ఆందోళనాకారులు యత్నించగా వారిపై జల  ఫిరంగులు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించి చెదరగొట్టారు. లాఠీఛార్జి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.